హనుమాన్ జయంతిని రెండు సార్లు ఎందుకు చేసుకుంటారో తెలుసా?

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో హనుమాన్ జయంతి ఒకటి. హనుమాన్ జయంతి ఏప్రిల్ 23వ తేదీన జరుపుకుంటూ ఉన్నారు
ఈ ఏడాది హనుమాన్ జయంతి మంగళవారం రావడంతో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుడికి శుభప్రదమైన రోజుగా భావించే రోజే హనుమాన్ జయంతి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు
హనుమంతుడి జయంతి సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు
వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి తేదీన స్వాతి నక్షత్రంలో జన్మించాడు. అందుకే ఈ తేదీని హనుమంతుని జన్మదినంగా జరుపుకుంటారు
హిందూ మత గ్రంధాల ప్రకారం సంకత్మోచన హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజు మంగళవారం మేషరాశిలో జన్మించాడు
చైత్రమాసంలో మరోసారి హనుమంతుడి జయంతిని జరుపుకుంటారు. పురాణాల ప్రకారం హనుమంతుడికి పుట్టినప్పటి నుండి అద్భుతమైన శక్తులు ఉన్నాయి
బాల్యంలో సూర్యుడిని మింగడానికి ప్రయత్నించాడు. దీని కారణంగా భూమి మొత్తం చీకటి వ్యాపించింది. ఇంద్ర దేవుడు హనుమంతుడిని ఆపడానికి పిడుగుతో కొట్టడంతో హనుమంతుడు కింద పడిపోతాడు
ఈ విషయం హనుమంతుడి తండ్రి పవనుడికి తెలియడంతో విశ్వం మొత్తం గాలిని నిలిపివేశాడు. ఇక బ్రహ్మ దేవుడు వచ్చి వాయు దేవుడి కోపాన్ని చల్లార్చాడు. హనుమంతుడికి ప్రాణం పోశాడు
చైత్ర మాసం పౌర్ణమి రోజున హనుమంతుడు కొత్త జీవితాన్ని పొందాడని నమ్ముతారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి నాడు హనుమంతుడి జయంతిని జరుపుకోవడానికి కారణం ఇదే