ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్

తమిళనాడు ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు ఇచ్చేందుకు అన్ని విధాలుగా యత్నం చేసిన టీటీవీ దినకరన్ తో పాటు మంత్రి విజయభాస్కరన్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దాదాపు 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఎన్నికల కమిషన్ గుర్తించింది. మంత్రి విజయభాస్కర్ ఇంటిపై దాడులు జరిపినప్పుడు అనేక పత్రాలు బయటపడ్డాయి. దీంతో ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలను రద్దు చేసింది. ఇంతవరకూ తిరిగి ఎప్పుడు ఎన్నిక నిర్వహించేది తెలపని ఎన్నికల కమిషన్ ఆదివారం ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు దినకరన్, మంత్రి విజయభాస్కర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1