తమిళనాడులో కమల్ వర్సెస్ సర్కార్

తమిళనాడులో విలక్షణ నటుడు కమల్ హాసన్ కు, రాష్ట్రప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. తమిళంలో బిగ్ బాస్ షో కు వ్యతిరేకంగా కొన్ని హిందూ సంఘాలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. కమల్ ను అరెస్ట్ చేయాలని కూడా హిందూ సంఘాలు కోరుతున్నాయి. హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా బిగ్ బాస్ షో నడుస్తుందని హిందూ సంఘాల ఆరోపణ. ఈ నేపథ్యంలో కమల్ షో పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ అవినీతి ఇష్టారాజ్యంగా మారిందన్నారు కమల్.

కమల్ కు మద్దతుగా సినీ పరిశ్రమ…డీఎంకే….

అయితే కమల్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. కమల్ ను అరెస్ట్ చేయాల్సిందేనని మంత్రి సీవీ షణ్ముగం అన్నారు. కమల్ ను మంత్రులు చెప్పరాని భాషలో దూషించారు. దీంతో కమల్ అభిమానులు మండిపడుతున్నారు. మంత్రులు షణ్ముగం, వేలుమణి, కడంబూరు రాజు, అన్బళగన్ కమల్ పై నోరు జారారు. దీంతో సినీలోకమంతా కమల్ కు అండగా నిలబడింది. మరోవైపు డీఎంకే కూడా కమల్ కు మద్దతిచ్చింది. సినీనటుడు కమల్ పై మంత్రులు చేసిన వ్యాఖ్యలను డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఖండించారు. కమల్ ఆరోపణలకు సమాధానం చెప్పలేకనే మంత్రులు దూషణకు దిగారన్నారు. మొత్తం మీద కమల్, అన్నాడీఎంకే మధ్య జరుగుతున్న వార్ తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1