ఈ ముదుసలి కాజోల్ అగర్వాల్ గా మారిపోయిందే…

సెలబ్రెటీల పేరు మీద ఓటర్, రేషన్ , ఆధార్ కార్డులు జారీ కావడం చూస్తూ ఉంటాం . తాజాగా తమిళనాడులో అలాంటి సంఘటన చర్చనీయాంశంగా మారింది. 87 సంవత్సరాల వయసున్న మహిళకు పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ను రెవెన్యూ యంత్రాంగం అందించింది. కొత్త కార్డు వచ్చిన ఆనందం ఆమెకు ఎంతో సేపు లేదు . కారణం అందులో వుండాలిసిన తన ఫొటోకు బదులుగా హీరోయిన్ కాజోల్ అగర్వాల్ బొమ్మ ఉండటంతో ఆమె కంగారు పడిపోయింది. ఈ విషయం నెమ్మదిగా మీడియా కు పొక్కడంతో ఒక్కసారిగా ఆమె సెలబ్రెటీ అయిపొయింది. అధికారులు ఇదెలా జరిగిందా అని తలపట్టుకు కూర్చున్నారు. ప్రభుత్వ సిబ్బంది కీలకమైన కార్డుల జారీ విషయంలో ఇలాంటి నిర్లక్యపు పనితీరు రివాజుగా మారిపోయింది. ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటున్నాయి. కంప్యూటర్ల సాయంతో జారీ అయ్యే ఇలాంటి కార్డుల విషయంలో తప్పు సిబ్బందిదే అని తెలుస్తున్నా నాలిక కరుచుకోవడం వినా ఎవరు ఏమి చేస్తున్నది లేదు మరి .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1