బనగానపల్లెలోనూ జగన్ బోణీ కొట్టారే…!

జగన్ పాదయాత్రలో చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో పట్టున్న నేతలను చేర్చుకునే ప్రయత్నంలో జగన్ ఉన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇటీవల భూమా నాగిరెడ్డికి అనుచరుడు మాజీ మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ బాలిరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇది అఖిలప్రియకు కొంత ఎదురుదెబ్బ తగిలినట్లే. ఆళ్లగడ్డలో ప్రజాసంకల్ప యాత్రకు మంచి స్పందనే లభించింది. వైసీపీ కార్యకర్తలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా జగన్ ను చూసేందుకు వస్తుండటంతో జగన్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

చేరికలతో హుషారుగా….

ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర ముగించుకుని బనగానపల్లె నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు జగన్. బనగానపల్లెలోనూ గట్టి లీడర్ ను పార్టీలోకి చేర్చుకున్నారు. టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ రామిరెడ్డి వైసీపీలో జగన్న సమక్షంలో చేరారు. రామిరెడ్డికి లోకల్ గా మంచి పేరుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డిని గెలిపించడంలో రామిరెడ్డి కీలకపాత్ర పోషించారు. అయితే ఆయన గతకొంతకాలంగా అసంతృప్తితో ఉండటంతో వైసీపీ నేతలు రామిరెడ్డిని సంప్రదించారు. ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో బనగానపల్లెలోనూ చేరికల్లో జగన్ బోణీ కొట్టినట్లయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1