బంగార్రాజు నుండి చైతు తప్పుకున్నాడా

Naga Chaitanya samantha film update

మజిలీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో వెంకీమామ చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ తరువాత చైతు ‘బంగార్రాజు’ లో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో చైతు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అలానే చైతు కి జోడిగా సమంత నటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి.

చైతు అంగీకరిస్తాడా….

తాజా సమాచారం ప్రకారం ఈ మధ్యే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఫుల్ స్క్రిప్ట్ తో చైతుని కలిసి కథ చెప్పినట్టు తెలుస్తుంది. చైతు కి కథ నచ్చకపోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే చైతు ఈ మూవీ నుండి పూర్తిగా తప్పుకున్నాడా? లేదా కథలో ఏమన్నా మార్పులు చేసుకుని రమ్మన్నాడా? అనేది తెలియాల్సిఉంది. ఇక ఇందులో నాగార్జున అండ్ చైతు తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఒకవేళ నిజం అయితే మాత్రం సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది. ఒకవేళ చైతు ఆ పాత్ర చేయను అంటే ఎవరు చేస్తారో చూడాలి.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*