వెబ్ సిరీస్ లోకి సమంత

అక్కినేని సమంత

అక్కినేని సమంత ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా అయిపోయింది. భాషలతో సంబంధం లేకుండా నటిస్తున్న సమంత త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ లో తెరకెక్కిన వెబ్ సిరీస్ లో. ఈ మధ్య డైరెక్టర్స్ సినిమాలకి ఏమాత్రం తీసిపోని విధంగా వెబ్ సిరీస్ తీస్తున్నారు. అన్ని పరిశ్రమల్లో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు.

కొట్టింది మంచి హిట్టు…..

అలానే రీసెంట్ గా రాజ్‌ డీకే దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌, ప్రియమణి, మనోజ్‌ బాజ్‌పాయ్‌ మెయిన్ పాత్రల్లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ మంచి హిట్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయినా ఈ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ అయినా ఈ సిరీస్ నెక్స్ట్ సీజన్ అంటే రెండో సీజన్ లో సమంత ముఖ్య పాత్రలో నటిస్తోందట. మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ నిజమే అని అంటున్నారు ఫిలింనగర్ జనాలు. ఫస్ట్ సీజన్ లో మొత్తం పది ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ బాగా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంతో ఈ సిరీస్ హిట్ అయింది. అందుకే ప్రేక్షకులు రెండో సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*