అఘోర ఎప్పుడు ఎంటర్ అవుతాడంటే…

Akhanda

బాలయ్య  అఖండ మూవీ ఫైనల్ అండ్ క్లైమాక్స్ షెడ్యూల్ తమిళనాడులో జరుగుతుంది. బోయపాటి – బాలకృష్ణ కాంబో అంటే.. ఆ రేంజ్, ఆ క్రేజ్ ఏ లెవల్లో ఉంటుందో ఇప్పుడు అఖండ మూవీ పై అంతే ఉంది. ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోర గా డిఫ్రెంట్ గా కనిపించబోతున్నారు. అఘోర పాత్రపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను ఈ సినిమాలో నటిస్తున్న జగపతి బాబు పాత్ర మరింతగా పెంచుతుంది.
లెజెండ్ మూవీలో బాలకృష్ణ తో భారీ ఫైట్స్ చేసిన జగపతి బాబు అఖండ లో ఓ కీలకపాత్రలో నటిస్తున్నారట. అయితే బాలకృష్ణ అఘోర పాత్ర ఇంటర్వెల్ కి ముందు ఎంటర్ అవుతుందని, అలాగే జగపతి బాబు పాత్ర కూడా ఇంటర్వెల్ కి ముందే రివీల్ అవుతుంది అని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర ఎంతో హైలైట్‌గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. అలా దాన్ని డిజైన్ చేశాడట బోయపాటి శ్రీను. మరి అఘోర పాత్రకి జగపతి పాత్రకి ఎక్కడో లింకై వుంటుంది అని, అందుకే ఈ రెండు పాత్రలను బోయపాటి ఇంటర్వెల్ కి ముందు ఎంట్రీ ఇప్పిస్తున్నాడని అంటున్నారు. 

Ravi Batchali
About Ravi Batchali 40289 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*