అనిల్ సుంకర విషయంలో అల్లరి నరేష్ హర్ట్ అయ్యాడట

సరిలేరు నీకెవ్వరూ మహేష్ బాబు రష్మిక మందన్న mahesh-babu-rashmika-mandanna

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర, అల్లరి నరేష్ కు మంచి రాపో ఉన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో సినిమాలు కూడా వచ్చాయి. అనిల్ తో మంచి సన్నిహితంగా ఉండే నరేష్…ప్రస్తుతం తాను చేస్తున్న కళ్యాణరాముడు అనే సినిమా విషయంలో ఫీల్ అయిన్నట్టు తెలుస్తుంది. ఈమూవీ కూడా అనిల్ సుంకరనే నిర్మిస్తున్నాడు. ఈమూవీని దసరాకు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో అనుకున్న టైంకి ఈమూవీ రిలీజ్ కావడంలేదు.

కళ్యాణరాముడు సినిమాను చకచకా ఫినిష్ చేయాల్సిన ప్రొడక్షన్ యూనిట్ అంత సంక్రాంతి కి రిలీజ్ అయ్యే సరిలేరు నీకెవ్వరూ సినిమా వ్యవహారాల్లో బిజీ అయిపోయారని అల్లరి నరేష్ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. తన సినిమాకి సంబంధించి మూడునాలుగు రోజుల ప్యాచ్ వర్క్ ను పూర్తి చేయడం లేదని నిర్మాత సన్నిహితుడు, నిర్మాణ కార్యక్రమాలు అన్నీ చూసే కిషోర్ దగ్గర అల్లరి నరేష్ కాస్త నిష్టూరంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం నిర్మాత అనిల్ దాకా వెళ్లడంతో అల్లరి నరేష్ సినిమాపై ఏకె యూనిట్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఎట్టిపరిస్థితుల్లో ఈమూవీ దీపావళి కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు అనిల్ సుంకర. ప్రస్తుతం డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. కానీ దీపావళి కి గట్టి పోటీ ఉంది. తమిళ చిత్రం బిగిల్ తెలుగు లో అదే రోజు రిలీజ్ అవుతుంది. దానితో పాటు తెలుగు నుండి మరో రెండు మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*