ఫైటర్ షూటింగ్ ఓ భిన్నమైన ప్రపంచం!!

Ananya Pandey

ఈ మాటన్నది ఎవరో కాదు హీరోయిన్ అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌-2 సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అనన్య పాండే.. బాలీవుడ్ లో మెల్లిగా పాతుకుపోతుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి డైరెక్షన్ లో పాన్ ఇండియా ఫిలిం తో సౌత్ కి పరిచయం కాబోతున్న అనన్య ఫైటర్ లో విజయ్ సరసన నటించడంతో బాగా ఎగ్జైట్ అవుతుంది. గతంలో విజయ్ దేవరకొండ అనన్యని సౌత్ లో టాప్ హీరోయిన్ అవుతుంది అంటే.. ఇప్పుడు అనన్య పాండే కూడా విజయ్ దేవరకొండ సూపర్ అనడమే కాదు.. తనతో నటించడం కంఫర్ట్ అంటుంది,.

ఇక ఫైటర్ సినిమా షూటింగ్ అనేది ఓ భిన్నమైన ప్రపంచం అని.. తాను చాలా హ్యాపీ అంటుంది అనన్య. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పాత్ర చాల బావుంటుంది అని చెప్పిన అనన్య తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలోనూ స్పందించింది. దీపికా పదుకొణె, సిద్దార్థ్‌ చతుర్వేది కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తునందుకు సంతోషంగా ఉందని.. ఈమధ్యనే జరిగిన గోవా షెడ్యూల్ లో బాగా ఎంజాయ్ చేశా అంటుంది. పూరి తోనూ, విజయ్ దేవరకొండ తో వర్క్ చెయ్యడం కొత్త ఎక్సపీరియెన్స్ అంటుంది ఈ ముద్దుగుమ్మ.

Ravi Batchali
About Ravi Batchali 32629 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*