జబర్దస్త్ ని వదిలేస్తుందా?

అనసూయ Anasuya

ఈటివి లో తెగ ఫెమస్ అయిన జబర్దస్త్ కి అంతగా పేరు రావడానికి.. ఒక విధంగా జబర్దస్త్ లోని జోక్స్ కారణమైతే.. మరో విధంగా హాట్ యాంకర్ అనసూయ కారణం. పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టినా… అందాన్ని అప్సరసలా కాపాడుకుంటూ.. హాట్ యాంగిల్స్ లో హీరోయిన్స్ కే పోటీ ఇచ్చే అందంతో అదరగొడుతూ.. జబర్దస్త్ ని ఎక్కడికో తీసుకెళ్లన ఘనత ఆమెది.  ఇక ఆమె కాస్త రెమ్యునరేషన్ పెంచిందనే కారణంగా రష్మిని పెట్టినా….  జబర్దస్త్ అంతగా క్లిక్ అవకపోయేసరికి అనసూయని జబర్దస్త్ కి రష్మిని ఎక్స్ట్రా జబర్దస్త్ కి పెట్టారు. జబర్దస్త్ తో మంచి ప్లాట్ ఫామ్ సంపాదించిన అనసూయ మెల్లగా వెండితెర మీదకూడా కాలు పెట్టింది. తనకు సరిపోయే పాత్రలతో వెండితెర మీద కూడా క్లిక్ అయ్యింది. క్షణంలో పోలీస్ ఆఫీసర్ గా, రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టిన ఆమె కి చిరు – కొరటాల మూవీలను ఓ కీలక పాత్ర పోషించబోతుంది . ఇక అనసూయ మెయిన్ లీడ్ లో కథనం సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.

అయితే వెండితెర మీద సినిమా అవకాశాలు బాగా రావడంతో అనసూయ జబర్దస్త్ సో కి బై బై చెప్పెయ్యబోతుందనే న్యూస్ జబర్దస్త్ అభిమానులను ఒకింత షాకుకు గురి చేస్తుంది. తనకెంతో పేరు తెచ్చిన జబర్ధస్త్‌ ప్రోగ్రాంకు, తనకెంతో ఇష్టమైన సినిమాలకు టైమ్ కేటాయించలేకపోతున్నట్టు ఆమె సన్నిహితుల వద్ద చెపుకుంటుందట. అయితే  ఆమె ఇపుడు చేస్తోన్న జబర్థస్త్ ప్రోగ్రాంకు కాస్తంత విరామిచ్చి పూర్తిగా తన సమయాన్ని సినిమాలకు కేటాయించాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. మరి తన గ్లామర్ తో జబర్దస్త్ కి ఓ నిండుతనాన్ని తెచ్చిన ఆమె యాంకరింగ్ లేకపోతె ఆ షో పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*