‘జబర్దస్త్’ చంటి కారు ప్రమాదం

చలాకీ చంటి Jabardasth

జబర్దస్త్’ లాంటి కామెడీ షో తో చాలామంది తెలుగు ఇండస్ట్రీ వస్తున్నారు. అలానే చలాకీ చంటి కూడా. కాకపోతే చంటి సినీ ఇండస్ట్రీకి వచ్చినా తరువాతే ‘జబర్దస్త్’ లోకి వచ్చాడు. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు చేస్తూ ‘జబర్దస్త్’ షో చేస్తున్న చంటి ఈ తెల్లవారుఝామున రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

చలాకీ చంటి విజయవాడ నుండి హైదరాబాద్ కి తన కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. కోదాడ మండలం కొమరబండ దగ్గర ఆయన ప్రయాణిస్తోన్న కారు ఆగివున్న లారీని వెనుకనుండి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారని సమాచారం.

వెంటనే ఆయనను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి వైద్యం చేస్తున్నారు అని టాక్. టాలీవుడ్ కి ఏదో జరుగుతుంది. వరసగా గాయాలు అవుతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్,వరుణ్ తేజ్, శర్వానంద్,నాగ శౌర్య, సందీప్ కిషన్, నితిన్ ఇలా వరస అందరికి గాయాలు అవ్వడం అందరిని ఆశర్యనికి గురి చేస్తుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*