మనోజ్ ఏదో చేబుతాడట

మంచు మనోజ్

కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ రాజకీయాలలో వేలుపెడదామని తిరిగి చివరికి మళ్ళీ సైలెంట్ అయిన మంచు మనోజ్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాడు. గత కొన్నాళ్లుగా సినిమాల విషయంలో మౌనం వహిస్తున్న మనోజ్ కొత్త సినిమా ఎప్పుడెప్పుడు మొదలెడతాడు అని మంచు అభిమానులు ఎదురు చూస్తున్నారు. మంచు మనోజ్ సినిమాలకు దూరమవుతాడనే ప్రచారమూ ఉంది. హీరోగా తప్పుకుని ఏ నిర్మాణ రంగంలోనో లేదా డైరెక్షన్ డిపార్ట్ట్ మెంట్ లోకో వెళతాడని అంటున్నారు.

ఏం చెబుతాడు…

ఇన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న మంచు మనోజ్ ఈ రోజు అంటే గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఏదో ఓ ముఖ్యమైన విషయాన్నీ అందరితో షేర్ చేసుకుంటానని అప్పటివరకు బై అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  మనోజ్ అలా  పోస్ట్ చెయ్యడంతో ఏదో సినిమా విషయమై ఓ ముఖ్యమైన ప్రకటన చేయ బోతు న్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. మరి మనోజ్ చెప్పబోయే ఆ ముఖ్యమైన విషయం ఏమిటో అనేది ఈ రోజు సాయంత్రం దాకా వెయిట్ చేస్తే గాని తెలియదు అప్పటివరకు సస్పెన్స్.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*