కొట్టెయ్యడం కన్నా.. కొనడం బెటర్ కదా?

nani new character

ఈమధ్యన ఏ సినిమా అయినా హిట్ అయ్యింది అంటే చాలు.. ఈకథ మాదే అంటూ ఎవరో ఒకరు ఆ సినిమా డైరెక్టర్స్ మీద కోర్టుకు కూడా వెళుతున్నారు. అలాగే దర్శకులు కూడా ఏదో ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అవడమో.. లేదంటే ఏదో ఓ నవల చదివి ఇన్స్పైర్ అవడం చేస్తున్నారు. కానీ తాము మాత్రం తమ సొంత కథతోనే సినిమాలు తీశామంటూ బిల్డప్ ఇస్తున్నారు. కొంతమంది మాత్రం తమని కథ దొంగతనం చేసారు అంటే సహించలేక ఎంతోకొంత ఇచ్చి సెటిల్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ హీరో కోసం దర్శకుడు ఓ కథని 50 లక్షలకు కొనుగోలు చేసినట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి. మీడియం రేంజ్ హీరోల్లో నెంబర్ వన్ హీరోగా ఉన్న నాని అడిగాడని టాక్సీవాలా దర్శకుడు ఓ కథని 50 లక్షలు పెట్టి కొన్నాడనే టాక్ వినబడుతుంది.

టాక్సీవాలా దర్శకుడు ఓ ఆడియో కంపెనీ మేనేజర్ నుండి నాని కి కథ నచ్చింది అని నాని కోసం శ్యాం సింగరాయ్ అనే కథని కొనడం ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. నాని కి కథ బాగా నచ్చడంతోనే ఆ మేనేజర్ కి ఏకంగా 50 లక్షలు ఇచ్చి కొన్నట్లుగా చెబుతున్నారు. కథ కాష్ట్లీనే. అయితే నాని జడ్జిమెంట్ మీదున్న నమ్మకంతో టాక్సీవాలా దర్శకుడు నాని చెప్పింది చేసాడట మరి ఇప్పటికే టైటిల్ కూడా ప్రకటించిన ఈ సినిమాని మే నుండి రెగ్యులర్ షూటింగ్ కి తీసుకెళ్ళబోతున్నారు. మరి టాక్సీవాలా తో బంపర్ హిట్ కొట్టిన ఈ దర్శకుడికి సెకండ్ ఛాన్స్ నాని ఇవ్వడం గ్రేట్. అందుకే నాని చెప్పింది చెప్పినట్టుగా ఆయన పాటిస్తున్నాడంటున్నారు

Ravi Batchali
About Ravi Batchali 33974 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*