అబ్బా….. అదరగొట్టేస్తున్నాడు

గద్దలకొండ గణేష్

వాల్మీకి గా కాకుండా గద్దలకొండ గణేష్ గా ప్రేక్షకులముందుకు వచ్చిన వరుణ్ తేజ్… గద్దలకొండ గణేష్ గా అదరగొట్టేస్తున్నాడు. మిక్స్డ్ టాక్ తోనే భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు. వరుణ్ మాస్ లుక్స్, మాస్ యాక్టింగ్ అన్ని మాస్ ప్రేక్షకులకు నచ్చడంతో సినిమా ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ కొల్లగ్టట్టింది. వీక్ డేస్ లో కూడా సినిమా వీక్ కాకూడదని వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాని తనవంతుగా ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. సినిమా విడుదలైన సాయంత్రానికే చిత్ర బృందంతో కలిసి సక్సెస్ మీట్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ సినిమాని ప్రమోట్ చేసే ఏ ఫ్లాట్ ఫామ్ వదలడం లేదు.

బిగ్ బాస్ లో వరుణ్ తేజ్ ….

బుల్లితెర ప్రేక్షకులు మెచ్చే షోస్ కి హాజరై వాల్మీకి ని ప్రమోట్ చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఈ టీవి లో ఫెమస్ అయిన జబర్దస్త్ షో కి దర్శకుడు హారిష్ తో కలిసి సందడి చేసిన వరుణ్ తేజ్… శనివారం జీ తెలుగులో ప్రసారమైన ప్రదీప్ మాచిరాజు కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను లో సందడి చేసాడు. అంతేనా ప్రస్తుతం బుల్లితెర మీద ప్రేక్షకులకు బాగా దగ్గరైన బిగ్ బాస్ సీజన్ 3 లో ఆదివారం రాత్రి బిగ్ బాస్ స్టేజ్ మీదనుండి బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో కలిసి వాల్మీకి సినిమాని ప్రమోట్ చేశారు. అలాగే సినిమా ప్రమోషన్స్ కోసం ఇప్పుడు వరుణ్ తేజ్ అండ్ వాల్మీకి యూనిట్ థియేటర్స్ బాట పట్టబోతునట్టుగా సమాచారం.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*