బిగ్ బాస్ కే షాకిచ్చిన మోనాల్!

Monal Gajjar

గత కొన్ని వారాలుగా మోనాల్ కోసం హౌస్ మేట్స్ లో మెహబూబ్, కుమార్ సాయి లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ని బలి చేస్తున్న బిగ్ బాస్ కి ఈసారి మోనాలే షాకిచ్చిందట. అఖిల్ తో అర్ధరాత్రి హగ్గులు, ముద్దుల తో అదరగొడుతున్న మోనాల్ ని బిగ్ బాస్ వదులుకోలేక మిగతా హౌస్ మేట్స్ ని ఇంటికి పంపించేస్తుంది. అయితే ఈసారి బిగ్ బాస్ మోనాల్ ని సేవ్ చెయ్యడం లేదు. అంటే నామినేషన్స్ లో ఉన్న మోనాల్ ఈసారి ఓట్స్ పరంగా బెటర్ పోస్జిషన్ లో ఉందట. ఓట్స్ పరంగా అభి ఎప్పటిలాగే టాప్ లో ఉండగా.. తర్వాత సోహైల్, తర్వాత హారిక.. ఆ తర్వాత అరియనా, మోనాల్ ఉంటే.. చివరి ప్లేస్ లో లాస్య ఉన్నట్టుగా సోషల్ మీడియా ప్రచారం. 

టాప్ 2 లో అభిజిత్, లాస్య లు ఉంటారని అంచనాలు ఉన్న టైం లో ఇలా లాస్య లాస్ట్ ప్లేస్ లో ఉండడం ఆమె అభిమానులకు షాకిచ్చింది.  మొదటి నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా సోషల్ మీడియాలో ఓట్స్ విషయంలో బలంగా ఉన్న లాస్య అనూహ్యంగా చివరి ప్లేస్ కి రావడం.. మోనాల్ లాస్య కన్నా బెటర్ పొజిషన్ లో ఉండడం అనేది ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్ధంకాని ప్రశ్న. ఎప్పుడూ బిగ్ బాస్ సేవ్ చేస్తున్న మోనాల్ ని ఈసారి ప్రేక్షకులు సేవ్ చేసేలా కనబడుతుంది వ్యవహారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*