అక్కడ కూడా కుమ్మేస్తుంది

ఎన్టీఆర్ Junior NTR రామాయణ

చాలా ప్లాప్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పూరి దర్శకత్వంలో చేసిన టెంపర్ సినిమాతో మళ్ళి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ హాఫ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ గా సెకండ్ హాఫ్ న్యాయాన్ని నిలబెట్టే పోలీస్ గా సిక్స్ ప్యాక్ బాడీ తో అదరగొట్టేసాడు. ఆ సినిమా తెలుగులో సూపర్ హిట్ అవడంతో…. ఆ సినిమా వచ్చిన చాన్నాళ్ళకి తమిళంలో విశాల్ తెలుగు టెంపర్ ని రీమేక్ చేస్తున్నాడు. మరోపక్క బాలీవుడ్ లో దర్శకుడు రోహిత్ శెట్టి, రణ్వీర్ సింగ్ – సారా అలీ ఖాన్ జంటగా సింబా గా రీమేక్ చెయ్యడం ఈ సినిమాని గత నెలలో ప్రేక్షకుల ముందు తేవడం జరిగిపోయాయి.

junior ntr telugu post telugu news

అయితే సింబా సినిమాకి బాలీవుడ్ లో మిక్స్డ్ టాక్ పడినప్పటికీ… సరైన సినిమాలేవీ లేక కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తుంది. విడుదలైన వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులోకి చేరిన ఈ సినిమా మూడో వారంలోకి అడుగుపెట్టకముందే 190.64 కోట్లను రాబట్టింది. తెలుగు టెంపర్ ని కాస్త అటు ఇటుగా మార్పులు చేసి మరీ రోహిత్ శెట్టి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక రణవీర్ ఎనర్జిటిక్ యాక్షన్.. సారా క్యూట్ లుక్స్ కి బాలీవుడ్ సినిమా లవర్స్ ఫిదా అవడమే కాదు… గత కొన్నాళ్లుగా బాలీవుడ్ లో మంచి సినిమాలేవి లేక తెగ ఇదైపోతున్న ప్రేక్షకులకు సింబా చక్కటి అవకాశం ఇచ్చింది. అందుకే ఇలా కోట్లకు కోట్లు కొల్లగొట్టుకుంటూ పోతుంది.

వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకూ ఈ సినిమా 190.64 కోట్లను రాబట్టింది. 3వ వారంలో 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. ఇక సింబా ఫైనల్ రన్ లో 250 కోట్ల క్లబ్బులోకి చేరడం ఖాయమంటున్నారు. మరి పెళ్లి తర్వాత రణవీర్ కి ఈ హిట్ ఎంత కిక్కిచ్చిందో… ఇప్పుడే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా అలీ ఖాన్ కి ఈ సినిమా హిట్ అంతే కిక్కిచ్చింది. ఈ సినిమా హిట్ తో సారా అలీ ఖాన్ కి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*