మహేష్ ఆమెని ప్రిఫర్ చేశాడా?

mahesh babu remunarations

మహేష్ బాబు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో పిల్లలల్తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంతగా షూటింగ్ పనులతో అలసిపోయినా.. పిల్లలు ఫ్యామిలీ కోసం టైం కేటాయించే మహేష్ బాబు…. ఈకరోనా సెలవులతో వెకేషన్ కి వెళ్లకపోయినా.. ఫ్యామిలీ తో ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నాడు. సితార పాపతో మహేష్ ఆటలతో టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు. ఇక మహేష్ అటు ఫ్యామిలీతో పాటుగా పరశురామ్ తో సినీమా విషయంలో ఎప్పుడూ ఫోన్ టచ్ లోనే ఉంటున్నాడట. 14 రీల్స్ – మైత్రి మూవీస్ కాంబోలో మహేష్ – పరశురామ్ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయం ఎప్పటికప్పుడు మహేష్ పరశురామ్ ని అడిగి తెలుసుకుంటున్నాడట.

ఇక పరశురామ్ నాగ చైతన్య తో సినిమా చెయ్యడానికి రెడీ అయినప్పుడు చైతూకి జోడిగా హీరోయిన్ గా తన లక్కీ హీరోయిన్ రశ్మికనే అనుకున్నాడట. అయితే ఇప్పుడు మహేష్ సినిమా విషయానికి వచ్చేసరికి.. పరశురామ్ ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. కానీ మహేష్ మాత్రం రష్మిక వద్దు.. ఇప్పుడే సరిలేరు నీకెవ్వరూ చేసేసాం. ఇక మహానటి లో కీర్తి సురేష్ నటన చాలా బావుంది. మన సినిమాలో ఎలాగూ హీరోయిన్ కి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి కీర్తి సురేష్ ని సంప్రదించమంటూ హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ప్రిఫర్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి మహేష్ – పరశురామ్ సినిమా  ఈ కరోనా హడావిడి ముగిశాకే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈలోపు పరశురామ్ మహేష్ కోసం పక్కా స్క్రిప్ట్ తో ఇంప్రెస్స్ చెయ్యాల్సి ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*