మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

ramcharan producing chiranjeevi films

మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వం చేసిన మగధీర సినిమా లో ఒక ఐదు నిమిషాలు కనిపిస్తేనే థియేటర్లు హోరెత్తిపోయాయి. అటువంటిది వీరు ఏకంగా ఒక ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తారు అని గత కొన్ని రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. అయితే చిరు చేసే సినిమాలో ఈసారి చరణ్ గెస్ట్ రోల్ చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అని వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని రూఢి అయింది.

సైరా ప్రమోషన్స్ లో భాగంగా చిరు మీడియా తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ విషయాన్నీ వెల్లడించారు. రామ్ చరణ్ ,నేను కలిసి నటించే సినిమా గురించి మరో రెండుమూడు రోజుల్లో న్యూస్ వింటారు అని ఆయన చెప్పడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే చిరు-చరణ్ కలిసి నటించే సినిమా మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ అయ్యుండొచ్చేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

సైరా రిలీజ్ కు ముందు కేరళలో ప్రమోషన్స్ కోసం వెళ్లిన చిరు…ఆ వేడుకకు వచ్చిన పృథ్వీరాజ్… చిరు లూసిఫర్ రీమేక్ హక్కులు కొన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈసినిమాలో చిరు నటించనున్నారు అని వార్తలు వస్తున్నాయి.పృథ్వీరాజ్ చేసిన పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడు అని అంటున్నారు. ఈమూవీ వచ్చే ఏడాది పట్టాలెక్కొచ్చని తెలుస్తోంది. ఈమూవీ చిరు కొరటాల సినిమా తరువాత స్టార్ట్ చేసే అవకాశముందని తెలుస్తుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*