అవన్నీ గాలివార్తలే

నాగార్జున

నాగార్జున రీసెంట్ గా తన కొత్త సినిమాని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ మొదలై ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేలోపు కరోనా సెకండ్ వేవ్ రావడంతో నాగార్జున ఆ సినిమా షూటింగ్ ని వాయిదా వేశారు. నాగార్జున రెండు డోస్ ల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా నాగార్జున – ప్రవీణ్ సత్తారు మూవీ ఆగిపోయింది అని.. కొన్ని టెక్నీకల్ ప్రోబ్లెంస్ వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటూ వార్తలొస్తున్నాయి.  
ప్రవీణ్ సత్తారు ఈమధ్యన 11th అవర్ వెబ్ సీరీస్ చేసాడు. మరి నాగ్ కి కథ మీద నమ్మకం లేకో.. లేదంటే ప్రవీణ్ డైరెక్షన్ పై అనుమానమో మొత్తానికి ఏదైనా నాగ్ – ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్ ఆగిపోయింది అని అంటున్నారు. అయితే ఇలాంటి పుకార్లకు చెక్ పెట్టేందుకు టీం నాగ్ – ప్రవీణ్ సత్తారు తదుపరి షెడ్యూల్ జూన్ మొదటి వారం నుండి ఉండబోతుంది అంటూ అప్ డేట్ ఇచ్చింది. ఈ సెకండ్ షెడ్యూల్ కోసం టీం మొత్తం లండన్‌కు ప్రయాణం కానుందని సమాచారం. విభిన్నమైన యాక్షన్‌ డ్రామాలో నాగార్జున ఓ శక్తిమంతమైన రా ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున కి జోడిగా ఫస్ట్ టైం కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

Ravi Batchali
About Ravi Batchali 39176 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*