
ఈమధ్యన నయనతార లైన్లోకొచ్చి చిన్న నిర్మాతలకు కూడా అందుబాటులోకి వచ్చింది అనే టాక్ మొదలైంది. గతంలో నయనతార ఏ సినిమా అయినా ఒప్పుకుంటే… కోట్లకి కోట్లు పారితోషకం తీసుకుని సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టేది. అలాగే తనతో పాటు వచ్చే తన పర్సనల్ సిబ్బంది ఖర్చులు కూడా ఆ నిర్మాతలకు వేసేది. అయితే నయనతార క్రేజ్ ముందు నిర్మాతలు తలవొంచేవారు. కానీ తాజాగా నయనతార ని పెద్ద నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు… ఆమెకి వరస ఫెయిల్యూర్స్ కారణంగానే నిర్మాతలు నయనతార కండిషన్స్ కి బెదరడం లేదనే టాక్ మొదలైంది. అయితే నయనతార ఇప్పటికే ఓ చిన్న నిర్మాత కోసం రెమ్యునరేషన్ తగ్గించింది అనే టాక్ నడవడం, లవర్ విగ్నేష్ కోసం తాను నటించబోయే సినిమా ప్రమోషన్స్ కి హాజరవుతుంది అనేప్రచారం జరుగుతుంది.
ఎలా లేదన్నా నయనతార మారింది అంటూ ఈమధ్యన సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఆయితే తాజాగా నయనతార మారింది అనడానికి సాక్ష్యంగా…. నయనతార తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా చెన్నై లోని ఓ కళాశాల లో ఆమె ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొనడం హాట్ టాపిక్ అయ్యింది. ఎప్పుడూ అవార్డు వేడుకలకి స్టయిల్ గా హాజరై.. అవార్డు ఎగరేసుకుపోయే నయనతార సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆడియో వేడుకకి కానీ, పర్సనల్ ఇంటర్వూస్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కానీ రాదు. కానీ తాజాగా ఆమె చెన్నై లోని ఓ కాలేజీ మహిళా దినోత్సవ ఉత్సవాలలో పాల్గొనడం మాత్రం అందరికి సర్ప్రైజింగ్ గా ఉంది. మరి నయన్ మారింది అనడానికి ఈ సాక్ష్యం సరిపోతుంది కదా.
Leave a Reply