‘సూర్యకాంతం’గా నిహారిక

niharika on syeraa movie role

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘సూర్యకాంతం’ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కి ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి కాగా, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగా, ఈ రోజే రిలీజ్ అయిన టీజర్ ఫీల్ గుడ్ గా రిఫ్రెషింగ్ గా ఉందంటూ కితాబు అందుకుంటుంది. శివాజీ రాజా, సుహాసిని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అమెరికాలో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లో అగ్రగామి సంస్థ అయిన నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

suryakantham first look

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*