రాజమౌళి చేసి చూపిస్తాడులే!!

రాజమౌళి

RRR సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడడం, ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఎన్టీఆర్ ఫాన్స్ కి రాజమౌళి షాకివ్వడం జరిగింది. జనవరి 8 2021 RRR  మూవీ విడుదల అవడం కష్టమనే అభిప్రాయంతో RRR విడుదల వాయిదాని RRR నిర్మాత కన్ఫర్మ్ చేసాడు. ఇక కరోనా లాక్ డౌన్ ముగిసాక కూడా గుంపులు గుంపులుగా షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతి లభించకపోవచ్చు. చిన్న చితక సినిమాలైతే కొంతమందితో సోషల్ డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తూ షూటింగ్ కానివ్వొచ్చు కానీ.. భారీ బడ్జెట్ సినిమాలకు అది సాధ్యమయ్యే పని కాదు.

కానీ తాజాగా రాజమౌళి అలా చెయ్యొచ్చు అంటున్నాడు. నిన్న చిరు ఇంటి దగ్గర జరిగిన సినిమా మీటింగ్ లో ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ సినిమాల షూట్ చేసుకోవచ్చునని….అది చిన్న చితక సినిమాకి కాకుండా RRR. లాంటి భారీ సినిమాకే చేయవచ్చునని రాజమౌళి చెప్పినట్లుగా తెలుస్తుంది. చాలా సన్నివేశాలకు తక్కువ సిబ్బందే సరిపోతారని.. అందుకోసం తాను RRR కి టెస్ట్ షూట్ కూడా చేసి చూపిస్తా అని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి రాజమౌళి చెప్పాడంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదని అంటున్నారట సినిమా పెద్దలు.

వచ్చే జూన్ నుండి తక్కువ మందితో చిన్న చిన్న సన్నివేశాలను షూట్ చేసి అక్టోబర్ నుండి ఎక్కువ మందితో షూటింగ్ చేస్తే బావుంటుంది అనే అభిప్రాయం అటు ఆచార్య దర్శకుడు కొరటాల శివ కూడా తెలిపినట్లుగా చెబుతున్నారు. అంటే RRR, ఆచార్య టెస్ట్ షూట్స్ జూన్ మొదటినుండి మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ టెస్ట్ షూట్ వర్కౌట్ అయితే గనక సినిమా షూటింగ్స్ కి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 25510 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*