అసలు రాజమౌళి వీరిని ఇన్వైట్ చేశాడా?

telugu post telugu news

ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయకి…నటుడు జగపతి బాబు అన్న కూతురు పూజా కి ఈరోజు పెళ్లి జరగపోతుంది. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జైపూర్ లోని ఓ హోటల్ లో జరగనుంది. టాలీవుడ్ నుండి చాలా మంది స్టార్స్ ఇప్పటికే అక్కడకు చేరుకొని సందడి చేస్తున్నారు. గత గురువారం సాయంత్రం నుంచే బరాత్ వేడుక సహా సంగీత్ కార్యక్రమానికి సంబంధించి హడావుడి మొదలైంది.

అయితే ఈ సంగీత్ కార్యక్రమంలో ఎన్టీఆర్ , ప్రభాస్, అఖిల్, రానా, అనుష్క, నాని, నాగార్జున తదితరులు కనిపించారు కానీ మెయిన్ స్టార్స్ మిస్ అయ్యారు. టాలీవుడ్ నుండి చాలామంది స్టార్స్ మిస్ అయ్యారు. ముఖ్యంగా చిరంజీవి..అల్లు అర్జున్..మహేష్ బాబు ఇప్పటివరకూ ఈ వేడుకల్లో కనిపించలేదు. అయితే అల్లు అరవింద్ అండ్ చిరంజీవి కి ఆహ్వానాలు అందాయిట. వీరు ఈరోజు వెళ్లే అవకాశం ఉంది. కానీ అల్లు అర్జున్ కి మహేష్ కి ఆహ్వానాలు అందలేదన్న ప్రచారం సాగుతోంది.

మరి ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ ఈ ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. అల్లు అర్జున్ అయితే హైదరాబాద్ లోనే ఉన్నాడు. కానీ మహేష్ రీసెంట్ గా తన ఫామిలీ తో కలిసి హాలిడే కి వెళ్ళాడు. టాలీవుడ్ నుండి తనకు అత్యంత సన్నిహితుల్ని మాత్రమే సెలక్టివ్ గా రాజమౌళి ఆహ్వానించారట. మహేష్ కు ఆహ్వానం అందినా దుబాయ్ లోనే ఉన్నాడని సమాచారం. రిసెప్షన్ గ్రాండ్ గా ఉంటుందని అప్పుడు రాజమౌళి అందరిని పిలుస్తాడని చెబుతున్నారు. బహుశా అప్పుడు ఇప్పుడు మిస్ అయినా వారంతా వచ్చే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*