రజనీ మాస్..ట్రైలర్ కేక..!

rajanikanth petta

తలైవా రజనీకాంత్ ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ‘పేట’ సినిమా త్వరలోనే తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. సిమ్రాన్, త్రిష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రజనీ చాలా కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. జనవరి 10న తమిళంలో పాటు తెలుగులో కూడా పేట రిలీజ్ కానుంది. ఈ రోజు ఉదయం తమిళ వర్షన్ ట్రైలర్ ను విడుదల చేసారు. రజనీ, సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా.. ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ స్టార్టింగ్ నుండి నాలుగైదు షాట్స్ రజనీని బ్యాక్ నుండి చూపించడం.. స్లోగా అతని లుక్ రివీల్ చేయటం చేసారు. యాక్షన్, కామెడీ ప్రధానంగా సాగే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

మాస్… క్లాస్ ని ఆకట్టుకునేలా

ఫైట్స్ కూడా చాలా స్టైలిష్ గా తీసినట్టు అర్ధం అవుతుంది. ట్రైలర్ మొత్తం రజనీ మరింత యంగ్ గా.. మరింత స్టైల్ గా కనిపించారు. ఈ ట్రైలర్ చివరిలో మాస్ లుక్ తో .. మాస్ బీట్ కి ఆయన వేసిన స్టెప్పులు చూసి తీరవలసిందే. ఈ సంక్రాంతికి తమిళంలో ఈ సినిమా ఒక ఊపు ఊపేస్తుందని ట్రైలర్ బట్టి అర్ధం అవుతుంది. మాస్ తో పాటు క్లాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ఉంది. విడుదలైన గంటలోనే 5 లక్షల వ్యూస్ వచ్చాయి. తెలుగు వర్షన్ ట్రైలర్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*