వర్మ నెక్స్ట్ మూవీ టైటిల్ ఏంటి ఇలా ఉంది

రాంగోపాల్ వర్మ

వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా సెన్సషనే. ఇతని లేటెస్ట్ మూవీ లక్ష్మిస్ ఎన్టీఆర్ గురించి ఆంధ్ర ప్రదేశ్ మొత్తం మాట్లాడుకుంటుంది. నిజానికి ఈమూవీ ఏపీ లో ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ అక్కడ ఎలక్షన్ కోడ్ ఉండడంతో రిలీజ్ కాలేదు. ఏపీ లో మినహా అన్ని చోట్ల ఈసినిమా విడుదలైంది.

ఇప్పుడు ఏపీ లో ఎలక్షన్స్ కూడా అయిపోయింది. టీడీపీ పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేయలేదు. దింతో వర్మ కి కొమ్ములొచ్చాయి. ఈసినిమా యొక్క ప్రెస్ మీట్ విజయవాడలో నిర్వహించాడు వర్మ. ఈ సందర్భంగా వర్మ ఆసక్తికర ప్రకటన చేశారు. మీ తరువాత చిత్రం ఏంటి అన్న ప్రశ్నకు…‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని ప్రకటించారు.

అయితే ‘కమ్మ రాజ్యంలో కడప రౌడీలు’ అని తొలుత ప్రకటించిన వర్మ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం గమనార్హం. తను విజయవాడ వచ్చిన తరువాతే ఈ ఐడియా వచ్చిందని అందుకే దీనికి ఈ టైటిల్ పెట్టాను అని అన్నాడు వర్మ. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో…ఎవరు ఇందులో నటిస్తున్నారో అన్నది మాత్రం ప్రకటించలేదు వర్మ.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*