కరోనా ఎఫెక్ట్: వైఫ్ తో గడపలేకపోతున్న మెగా హీరో?

Ramcharan Upasana

కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్స్ మొత్తం పడుకున్నాను. స్టార్ హీరోల దగ్గరనుండి చిన్న సినిమా హీరోల వరకు సెట్స్ మీదకెళ్లడానికి భయపడుతున్నారు. ఇక కరోనా తగ్గాలి.. వ్యాక్సిన్ రావాలి.. సినిమా షూటింగ్స్ మొదలవ్వాలి.. ఇదే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం చెబుతున్న మాట. ఇక లాక్ డౌన్ తో ఏ హీరో వెకేషన్ కి వెళ్ళడానికి కూడా లేదు. అందుకే భార్య పిల్లల్తో హీరోలంతా ఇళ్లలోనే ఎంజాయ్ చేస్తుంటే రామ్ చరణ్ మాత్రం ఉపాసనని కలవడానికి నానా కష్టాలు అపడుతున్నాడట. ఈ విషయం స్వయంగా రామ్ చరణే చెబుతున్నాడు. హోమ్ క్వారంటైన్ లోనే ఉంటున్న రామ్ చరణ్ లాక్ డౌన్ విషయాలను పంచుకుంటూ.. తన భార్యతో తాను ఎంజాయ్ చేయలేకపోతున్న విషయం చెప్పేసాడు.

ఇంతకీ ఉపాసన – రామ్ చరణ్ ఒకే ఇంట్లోనే ఉంటున్నప్పటికీ.. కలవకపోవడానికి గల కారణం కూడా చెప్పాడు. అదేమంటే కరోనా వలన హాస్పిటల్స్ అన్ని బిజీగా మరిపోయాయి. అపోలో హాస్పిటల్ పనులతో ఉపాసన బాగా బిజీ అయ్యిందట. అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్‌గా ఉన్న ఉపాసన కరోనా కారణంగా ఇంటి నుంచే హాస్పిటల్‌కి సంబంధించిన పనులు చూసుకుంటోందని.. దాని వలనే తానూ ఉపాసనని ఎక్కువగా కలవలేకపోతున్నా అని.. కేవలం భోజనం టైం లోనే ఉపాసనాతో టైం స్పెండ్ చేస్తున్నట్టుగా చెబుతున్నాడు రామ్ చరణ్. ఎంత బిజీ అయినా.. సామజిక స్పృహ కలిగిన భార్య దొరకడం తన అదృష్టం అంటూ ఉపాసనని పొగిడేస్తున్నాడు చరణ్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*