డిమాండ్ పెరిగితే.. పారితోషికం పెరగదా?

Rashmika mandanna movie with allu arjun

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత బాగా తెలుస్తుంది. హీరోయిన్స్ కొరత వల్లే హిట్స్ లేకపోయినా.. స్టార్ హీరోలంతా పూజా హెగ్డే వెంటపడాల్సి వస్తుంది. పూజ తర్వాత రష్మిక మందన్న ని తగులుకున్నారు. పూజ హెగ్డే నలుగురు స్టార్ హీరోస్ తో పనిచేసిన తర్వత రెమ్యునరేషన్ పెంచింది. కానీ రష్మికమొదటిసారిగా మహేష్ తో పనిచేస్తూనే తన పారితోషకాన్ని డబుల్ చేసింది అని, పారితోషికం కారణంగా అవకాశాలు వదులుకుంటుంది అనే టాక్ గత వారం పదిరోజులుగా నడుస్తూనే ఉంది. ఆమె పెంచిన పారితోషకం ఇవ్వలేక నిర్మాతలు బెదిరిపోతున్నారు అని అంటున్నారు. అయితే పారితోషికం న్యూస్ ల విషయం తెలిసిన రష్మిక… ఈ విషయంపై కాస్త ఘాటుగా స్పందించింది.

నచ్చకనే అలా చేస్తున్నా….

క్రేజ్ ఉన్న హీరోయిన్ కీ ఎంత పారితోషికం ఇవ్వాలో నిర్మాతలకు తెలియదా, ఓ నిర్మాత హీరోయిన్ కి కోటి పారితోషికం ఇస్తున్నాడు అంటే… ఆమె డిమాండ్ ని బట్టే ఇస్తాడు కానీ.. ఊరికే ఆమెకి కోటి ఇవ్వరు కదా, అంతేకాని హీరోయిన్స్ డిమాండ్ చేస్తేనే నిర్మాతలు కోట్లు ఇచ్చేస్తారా అంటూ ఫైర్ అవుతుంది. అలాగే ఆ పారితోషికం పెంచడం వల్ల తానేమీ అవకాశాలు కోల్పోలేదని, తనకి కొన్ని కథలు నచ్చక, అలాగే కథ నచ్చినా తన పాత్రలు నచ్చక తానే అవకాశాలు వదులుకుంటున్నానని చెబుతుంది. మరి పారితోషికం ఆడగకుండానే రష్మిక పారితోషికం పెంచిందనే న్యూస్ అయితే స్ప్రెడ్ అవదు కదా… అంటూ కొంతమంది నోళ్లు నొక్కుకుంటున్నారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*