అక్కడ రోజా.. ఇక్కడ నాగబాబు

Roja Jabardast

జబర్దస్త్ లో రోజా మరో జడ్జ్ గురించి తెగ వెయిట్ చేస్తుంది. నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళాక వారానికో జడ్జ్ వస్తుండటంతో రోజా పర్మినెంట్ జేడ్జ్ కోసం ఎదురు చూస్తుంది. ఇక జబర్దస్త్ నుండి బయటికెళ్లి జబర్దస్త్ విషయంలో నోరుపారేసుకున్న నాగబాబు జీ తెలుగులో ప్రసారమవుతున్న అదిరింది ప్రోగ్రాం కి జడ్జ్ గా అదిరిపోయే లెవల్లో ఎంట్రీఇచ్చాడు. అయితే నాగబాబు జడ్జ్ గా మొదలైన అదిరింది షో ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ని యాజిటీజ్ గా దింపేశారు. ఇప్పటికే జబర్దస్త్ కి కాపీ పేస్ట్ అంటూ అదిరింది షో ని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు.

జబర్దస్ లోలా ఓ హాట్ యాంకర్, ఇద్దరు జేడ్జ్ లు, ఐదారు స్కిట్స్, నాలుగు టీం లీడర్స్.. మిగతా కమెడియన్స్ ఇలా అదిరింది షో మొత్తం జబర్దస్త్ షో ని పోలి ఉంది. అయితే ఇక్కడ నాగబాబు వెళ్ళాక రోజా జబర్దస్త్ లో మరో జడ్జ్ విషయంలో ఎలా ఉందొ.. ఇపుడు నాగబాబు పక్కన కూడా అదిరింది షోలో మరో పర్మినెంట్ జడ్జ్ ఎవరో అంటున్నారు. ఎందుకంటే అదిరింది షో ఓపెనింగ్ కి నిహారిక స్పషల్ గెస్ట్ కాబట్టి నాగబాబు పక్కనకూర్చుంది. తర్వాత వారం మళ్ళి వేరొకరు నాగబాబు పక్కన కూర్చుంటారు. ఇక జబర్దస్త్ షో లో తమ సినిమా ప్రమోషన్స్ కోసం యంగ్ హీరోలెలా వస్తున్నారో.. అదిరింది షో కి కూడా మొదటి యంగ్ హీరో రాజ్ తరుణ్ తన ఇద్దరి లోకం ఒక్కటే ప్రమోషన్స్ కి రావడం… ఆర్పీ స్కిట్ లో పెరఫార్మెన్స్ చెయ్యడం జరిగింది. ఇక ఇక్కడ జబర్దస్త్ లోను నిఖిల్, కార్తికేయ లాంటి హీరోలు గెస్ట్ లుగా రావడం తమ సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ స్కిట్స్ లో భాగమవడం చేస్తున్నారు. ఇక జబర్దస్త్ లోలా.. ధనరాజ్, వేణు, చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటోళ్ళు టీం లీడర్స్ గా స్కిట్స్ చేసుకుంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 36932 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*