కరోనా కారణంగా బంద్.. అయినా రూమర్లా?

Renu Desai

కరోనాతో షూటింగ్స్ అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అర్ధం కానీ పరిస్థితి. ఒక పక్క సీరియల్స్ లేక గృహిణులకు బోర్ ఫీలవుతుంటే… కరోనా కారణంగా సినిమాలు వాయిదా పడి యూత్ కి బోర్ కొడుతోంది. మరోపక్క చిన్న పిల్లలు ఇళ్లకే పరిమితమై… చూసిన సినిమాలు చూడలేక బోర్ కొట్టి చేస్తున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో పుట్టే రూమర్స్ కి మాత్రం అంతూపొంతూ లేదు. గాసిప్ రాయుళ్లు గాసిప్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అందులో భాగంగా వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో శృతి హాసన్ అన్నారు. కాదు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే ఆ వార్త రేణు దేశాయ్ కంట బడడంతో.. రేణు దేశాయ్ మాత్రం ఫైర్ అవుతుంది. కరోనా  తో దేశం అల్లకల్లోలం అవుతుంటే… ఈ గాసిప్స్ ఏమిటి. నేను పవన్ కళ్యాణ్ వాకేల్ సాబ్ లో నటిస్తున్న అంటూ వచ్చిన వార్తలు ఇది పచ్చి అబద్ధం. ఎవరో రూమర్లు స్టార్ట్‌ చేస్తారు.. అసలు రూమర్లు స్టార్ట్‌ అంత సమయం వారికి ఎలా ఉంటుంది. ఇటువంటి వారి తీరుని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. అంటూ వకీల్ సాబ్ లో తాను నటిస్తున్న అనే వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. గతంలోనూ పవన్ సినిమాల్లోనూ రేణు దేశాయ్ నటిస్తుంది అనే న్యూస్ లు చాలా వచ్చాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*