పోటీపడుతున్న స్టార్ హీరోస్!!

కరోనా కల్లోలానికి స్టార్ హీరోస్ అంతా చేతనైన సాయం చేస్తున్నారు. హోమ్ క్వారంటైన్ లో ఇంటిపట్టునే ఉంటున్న హీరోస్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు వీలైనంతగా సహాయం చేస్తున్నారు. ఫస్ట్ నితిన్ రెండు రాష్ట్రాలకు తలో 10 లక్షల సహాయం చెయ్యగా తర్వాత ఒక్కొక్కరిగా తమతమ సహాయాన్ని ప్రకటిస్తున్నారు హీరోలు. స్టార్ హీరోలు ఒకరి  మీద ఒకరు పోటీ పడుతున్నారు.ఓ పక్క ఎవరేంతిస్తున్నారో చూసుకుని హీరోల ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. కరోనా వైరస్ వలన అతలాకుతలం అవుతున్న స్టేట్స్ కి హీరోల సహాయం మాత్రం మరవలేనిది. కానీ ఫాన్స్ మాత్రం మా హీరోలు గొప్ప అంటే మా హీరోలు గొప్ప అంటూ రెచ్చిపోతున్నారు.

మహేష్ బాబు కోటి విరాళం ఇవ్వగా.. పవన్ కళ్యాణ్ రెండు కోట్లు, రామ్ చరణ్ 75 లక్షలు, ఎన్టీఆర్ 75 లక్షలు, ప్రభ్స్ కూడా భారీ విరాళం ప్రకటించగా… దర్శకులు కూడా చెరో పదిలక్షలు విరాళాలు ప్రకటిస్తున్నారు. మరి గొప్పగా పబ్లిసిటీ కోసమా..లేదా నిజంగా మనస్ఫూర్తిగా హీరోల విరాళాలు ఉన్నాయో కానీ ఫాన్స్ మాత్రం మా హీరోలు చూడండి అందరి కన్నా ఎక్కువ విరాళం ఇచ్చారు అంటూ రెచ్చిపోతూ గొడవలు స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే ఒకరిని చూసి ఒకరు పోటీపడి విరాళాలు ప్రకటించడం చూస్తే ఇదంతా పబ్లిసిటీ స్టెంట్ లగే అనిపిస్తుంది కొంతమందికి. మరోపక్క తమిళనాట హీరోలంతా భారీ విరాళాలు ప్రకటిస్తే..లోకనాయకుడు కమల్ హాసన్ ఏకంగా తన ఇంటిని హాస్పిటల్ గా మర్చేస్తానని ప్రకటించారు. నిజంగా హీరోలంతా పబ్లసిటీ కోసం చేశారనుకోవడం కంటే…. ఇలాంటి సమయాల్లో మేమున్నాం అంటూ ముందుకు రావడం గ్రేట్. సినిమాల్లోనే హీరోయిజం చూపించే హీరోలంతా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేమున్నాం అంటూ ముందుకు రావడం మాత్రం నిజంగా హీరోయిజమనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*