ప్రొడ్యూసర్ ని తిట్టేసిన సుమంత్

sumanth new movie

‘మళ్లీ రావా’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు అనుకున్న సుమంత్ కు ఈమధ్య వరస ఫ్లాపు వస్తున్నాయి. ఈ ఏడాది రెండు డిజాస్టర్స్ ను అందుకున్నాడు. ‘సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం’, ఇప్ప‌డు ‘ఇదం జ‌గ‌త్’ రెండూ ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. ఈ రెండు సినిమాల్లో ‘సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం’కి కాస్తో కూస్తో ఓపెనింగ్స్ అన్న వచ్చాయి.

కానీ ‘ఇదం జ‌గ‌త్’ కి అయితే మ‌రీ దారుణం. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. సుమంత్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా ఓపెనింగ్స్ వచ్చాయి. విడుదల అయినా అన్ని థియేటర్స్ లో 20 నుండి 30 వరకే ప్రేక్షకులు ఉంటున్నారంటే ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అసలు ఈసినిమా వస్తుందని మీడియా వారికి తెలియలేదు అంటే ఎంత దారుణమో అర్ధం చేసుకోవచ్చు.

మెయిన్ కారణం ప‌బ్లిసిటీ అసలు లేకపోవడం. అందుకే సుమంత్ ప్రొడ్యూసర్ ని చెడమెడ తిట్టేశాడట. తన కెరీర్ లో ఎన్నడూ ఇంత దారుణమైన ఓపెనింగ్స్ రాలేదని.. వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న‌ప్పుడు కూడా మంచి ఓపెనింగ్సే ద‌క్కాయ‌ని..ప్రమోషన్స్ చేయడం ఇష్టం లేకపోతే నాకన్నా చేబితే నేను ఏదోకటి చేసుకునే వాడని అని ఒక లేఖ రాసి ప్రొడ్యూసర్ కి పంపాడట. ఈసినిమాపై సుమంత్ మొదటినుండి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇటువంటి పాత్ర ఎప్పుడూ చేయ‌లేద‌ని జనాలు దీన్ని కచ్చితంగా యాక్సప్ట్ చేస్తారని ధీమా వ్యక్తం చేసాడు కానీ రిజల్టే నెగటివ్ గా వచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*