టాలీవుడ్ కి ఆ డేట్ చాలా కీలకం

జీఎస్టీ

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ నుంచి రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి మహేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు తో పాటు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న‘అల వైకుంఠపురములో’ రిలీజ్ అవుతున్నాయి. కరెక్ట్ గా సంక్రాంతి పండగకు రిలీజ్ చేద్దాం అనుకుంటే ఆ రోజు మంగళవారం కావడంతో కొంచెం ముందుగానే వస్తే వీకెండ్ కూడా కలిసొచ్చే అవకాశముందని భావిస్తున్నారు ఆయా సినిమాల నిర్మాతలు.

ఆ రోజే రెండు కొత్త చిత్రాలు…

అందుకే రెండు సినిమాల నిర్మాతలు జనవరి 10 డేట్‌ పై పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగకు సెలవులు ఉంటాయి కాబట్టి ఏ రోజు రిలీజ్ చేసినా పెద్ద తేడా ఉండదు. కానీ ఓవర్సీస్‌ మార్కెట్‌లో వసూళ్లు రావాలంటే వీకెండ్ కే సినిమాలు రావాలి. అసలే మహేష్‌-అనిల్‌ రావిపూడి సినిమా, మరోవైపు అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ కావడంతో రెండూ ఓవర్సీస్‌ మార్కెట్‌లో హాట్‌ చిత్రాలే.

ఆ డేట్ పైనే నిర్మాతల చూపు…..

ఏ నిర్మాత కూడా అక్కడ మార్కెట్ ని కోల్పోవడానికి అంగీకరించడం లేదు. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య డైరెక్ట్‌ క్లాష్‌ లేదా వన్‌ డే గ్యాప్‌ వుంటుందనిపిస్తోంది. అందుకే జనవరి 10 డేట్‌ హాట్‌గా మారింది. ఇక ఈ రెండు చిత్రాలతో పాటు రజినీకాంత్ ‘దర్బార్‌’ కూడా అదే డేట్‌ని టార్గెట్‌ చేస్తున్నట్లు  తెలిసింది. ఆ డేట్ కే రావాలని మూడు సినిమాల నిర్మాతలు కంకణం కట్టుకుని కూర్చున్నారు. తమ ప్రాజెక్ట్స్ పై నమ్మకంతో ఎవరూ వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*