విజిల్ మూవీ రివ్యూ

విజిల్

బ్యానర్: ఈస్ట్‌కోస్ట్ బ్యాన‌ర్‌

నటీనటులు: విజయ్, నయనతార, వివేక్, జాకీష్రాఫ్‌, యోగి బాబు, ఆనంద్ రాజ్, సౌందరరాజా, రాజ్ కుమార్, దేవదార్శిని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: A. R. రెహమాన్

సినిమాటోగ్రాఫర్:G. K.విష్ణు

ఎడిటర్:రూబెన్

ప్రొడ్యూసర్స్: మ‌హేష్ ఎస్‌.కోనేరు

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అట్లీ

కోలీవుడ్ హీరో విజయ్ కి తెలుగులో రజినీకాంత్ అంత ఫాలోయింగ్ లేకపోయినా.. విజయ్ సినిమాలకు తెలుగులో భారీ డిమాండ్ ఉండబట్టి.. ఆయన సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ ఇక్కడ కూడా అదరగొడుతున్నాయి. కత్తి, మెర్సెల్ లాంటి సినిమాల్తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ తనకి అచ్చొచ్చిన దర్శకుడు అట్లీ తో కలిసి కోలీవుడ్ లో చేసిన బిగిల్ సినిమాని తెలుగులో విజిల్ గా డబ్ చేసి విడుదల చేశారు. నయనతార హీరోయిన్ కావడం, విజయ్ -ఆట్లీ కాంబో కి భారీ క్రేజ్ ఉండడంతో విజిల్ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి ఏర్పడింది. మరి విజయ్ – అట్లీ కలిసి విజిల్ తో ప్రేక్షకులతో విజిల్ వేయించారా?లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

మైఖేల్(విజయ్) రాజప్ప(విజయ్) అనే రౌడీ కొడుకు. మైఖేల్ ఒక ఫుట్ బాల్ ప్లేయర్. మైఖేల్ ఫుట్‌బాల్ ఆట‌తోనే బ‌స్తీలోని కుర్రాళ్లో మార్పు తెస్తుండ‌టం గ‌మ‌నించిన రాజ‌ప్ప అత‌న్ని గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండ‌మ‌ని చెబుతాడు. మైఖేల్ మాత్రం త‌ను నేష‌న‌ల్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటాడు. అలాంటి క్ర‌మంలో రాజ‌ప్ప‌ని ప్ర‌త్య‌ర్థులు చంపేస్తారు. మైకేల్ తన తండ్రి స్థానంలో బ‌స్తీ వారి కోసం క‌త్తిప‌డ‌తాడు. బస్తీ వాళ్ళ కోసం ఆఖరుకి తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్ ఆటను వదిలేసుకుంటాడు. కొంత కాలం తర్వాత ఒక మహిళా ఫుట్ బాల్ టీమ్ కు కోచ్ గా నియమించబడతాడు.ఇలా నియమించబడ్డ మైఖేల్ ని మహిళా ఫుడ్ బాల్ ప్లేయర్స్ తమ కోచ్ గా ఒప్పుకుంటారా? రౌడీగా మారిన మైఖేల్ కి కోచ్ పదవి ఎలా వచ్చింది? మైఖేల్ నేతృత్వంలో ఆ ఉమెన్ టీమ్ నేషనల్ కప్ గెలిచిందా? లేదా? అనేది తెలియాలంటే… విజిల్ సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన:

రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో ఒక మధ్య వయస్కుడిలా అలాగే ఫుట్ బాల్ ప్లేయర్ గా మరియు కోచ్ గా విజయ్ అదిరిపోయే నటన కనబర్చాడు.రాజ‌ప్ప‌, మైకేల్ అనే రెండు పాత్ర‌ల్లో చ‌క్క‌టి వేరియేష‌న్స్‌ను చూపిస్తూ న‌టించాడు. రాజ‌ప్ప పాత్ర అభిమానులను ఆక‌ట్టుకునేలా మాస్‌గా ఉంటే.. మైకేల్ పాత్ర తండ్రి ఆశ‌యాల కోసం పాటుప‌డే యువకులకు ఇన్‌స్పిరేష‌న‌ల్‌గా సాగుతుంది. ఎమోషనల్ సీన్స్ మరియు యాక్షన్ సీన్స్ లో విజయ్ పలికించిన హావభావాలు సూపర్ గా ఉన్నాయి. ఇక న‌య‌న‌తార త‌న పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించింది. అందంగా కనిపిస్తూ… మంచి నటన కనబర్చింది. జాకీష్రాఫ్ స్టైలిష్ విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకున్నాడు. మెడియన్ యోగి బాబు మరియు వివేక్ ల కామెడీ ట్రాక్స్ బాగున్నాయి. మిగతా నటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

అట్లీ – విజయ్ ల కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే.. ఆ సినిమాపై క్రేజ్ ఏ లెవల్లో ఉంటుందో అనేది.. యావరేజ్ టాక్ తో నే బ్లాక్ బస్టర్ అయ్యేంత ఉంటుంది అనేది అట్లీ – విజయ్ ల మెర్సెల్ సినిమా నిరూపించింది. జస్ట్ యావరేజ్ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అంటే ఆ క్రేజ్ ఏ లెవల్లో ఉందొ తెలుస్తుంది. ఇక దర్శకుడు అట్లీ ఎంచుకునే కథలన్నీ ఏదో ఓ సోషల్ మెస్సేజ్ కలిగి ఉంటాయనేది ఆయన గత చిత్రాలు చూస్తేనే తెలుస్తుంది. అందుకే అట్లీ.. విజయ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సోషల్ మెస్సేజ్ కథలతో హిట్స్ కొడుతున్నాడు. ఇక విజిల్ సినిమాలోకి వెళితే… విజిల్ ప‌క్కా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప‌క్కా మాస్ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్‌, హీరోయిన్ ఇంట్ర‌డ‌క్ష‌న్ చూస్తే.. ఇది కేవలం విజయ్ అభిమానులకోసమే తెరకెక్కించారు అనిపిస్తుంది. విజయ్ మ్యానరిజమ్స్ కూడా అతని అభిమానులకు మాత్రమే అప్పీల్ అయ్యేలా ఉంటాయి అయితే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ తో సినిమా ఫస్ట్ హాఫ్ లో కాస్త మెయిన్ స్టోరీ లోకి వెళ్ళడానికి ఎక్కువ సమయమే తీసుకున్నట్టు అనిపిస్తుంది. దాంతో ఈ సారి అట్లీ రాంగ్ స్టెప్ తీసుకున్నాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లోని ప్రీ ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. బిగిల్‌గా నేషనల్ రేంజ్ ప్లేయర్‌గా ఉన్న విజయ్ మైఖేల్‌గా మారి కత్తి ఎందుకు పట్టాడు లాంటి వాటిని ఫుల్ ప్లెడ్జెడ్‌గా ఎమోషన్‌తో ప్రెజెంట్ చేసి ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ మీద హోప్స్ పెట్టుకునేలా చేశాడు. సెకండ్ హాఫ్ నుంచి రైటర్‌గా, డైరెక్టర్‌గా తన క్లాస్‌ని చూపించాడు అట్లీ. లిమిటెడ్ అప్పీల్ ఉండే స్పోర్ట్స్ డ్రామాని అందరికి కనెక్ట్ అయ్యేలా, మాస్‌కి నచ్చేలా, మహిళలు కూడా మెచ్చి విజిల్ వేసేలా ఈ విజిల్‌ని మలిచాడు. లేడీస్ ఫుట్ బాల్ కోచ్ గా విజయ్ నియమించబడిన తర్వాత నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఒక పక్క ఎమోషన్స్ తో పాటుగా మంచి కామెడీని కూడా క్యారీ చేస్తూ వచ్చారు.సెకండ్ హాఫ్‌లో స్టార్ హీరో అయిన విజయ్ కూడా తాను తగ్గి కథలో డెప్త్‌ని గెలిపించాడు. విజయ్ హీరోయిజాన్ని వదిలిపెట్టకుండా, ఎమోషన్ తగ్గకుండా సెకండ్ హాఫ్‌ని నిలబెట్టాడు. దీంతో ఇంటర్వెల్ వరకు సో సో అనిపించిన సినిమా సెకండ్ పూర్తయ్యేసరికి మాత్రం బావుంది అనిపిస్తుంది.

సాంకేతికంగా:

A.R.రెహమాన్ సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. పాటల పరంగా ఈ సినిమాలో పెద్దగా స్కోప్ లేదు. అయితే సెకండ్ హాఫ్‌లో నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంది. G.K విష్ణు సినిమాటోగ్రఫీ సినిమాకి మరొక హైలైట్. ముఖ్యంగా ఫుట్ బాల్ సీక్వెన్సెస్ షూట్ చేసినప్పుడు రియలిస్టిక్ లుక్ రావడానికి కెమెరామన్ పడిన కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇక ఎడిటర్ రూబెన్ మాత్రం ఎడిటింగ్ పై మరి కాస్త దృష్టి పెడితే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాణ విలువలు కథానుసారంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: విజయ్ అద్భుత నటన, బ్యాగ్రౌండ్ స్కోర్, సెకండాఫ్, సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ సీన్స్, స్పోర్ట్డ్ బ్యాగ్రౌండ్ కథ

నెగెటివ్ పాయింట్స్: కథలో కొత్తదనం లేకపోవడం, సినిమా నిడివి, ఫస్ట్ హాఫ్

రేటింగ్: 2.75/5

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*