అంత ధైర్యం ఉందా జగన్?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చేంత ధైర్యం జగన్ కు ఉందా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఈరోజు రాజధాని అమరావతిలో పర్యటించి భవనాలను పరిశీలించారు. [more]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చేంత ధైర్యం జగన్ కు ఉందా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఈరోజు రాజధాని అమరావతిలో పర్యటించి భవనాలను పరిశీలించారు. [more]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చేంత ధైర్యం జగన్ కు ఉందా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఈరోజు రాజధాని అమరావతిలో పర్యటించి భవనాలను పరిశీలించారు. రాజధాని అమరావతిని మర్చేంత ధైర్యం జగన్ కు లేదన్నారు. ఇక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తూ తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. తమపై అవినీతి ఆరోపణలు చేసి రాజధాని అమరావతిని తరలించాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే రాజధానిని చంపేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. తప్పుడు ఆరోపణలు టీడీపీపై చేస్తూ పబ్బం గడపాలని చూస్తుందన్నారు.
టీడీపీ పోరాటం వల్లనే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ వచ్చింద్నారు చంద్రబాబు. ఇప్పటికైనా జగన్ అమరావతి పై దృష్టిపెట్టాలని కోరారు.