శిశు సంక్షేమ శాఖపై ఏపీ సీఎం సమీక్ష

మహిళా శిశుసంక్షేమ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఈ సమీక్ష జరిగింది. సంక్షేమ పథకాల అమల్లో అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల అమల్లో అనుసరిస్తున్న విధానాలు పథకాలను నిరాకరించేలా ఉండకూడదని సీఎం సూచించారు. పథకాలు సంతృప్తికర స్థాయిలో లబ్ధిదారులకు అందించడానికే ఈ విధానాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌, వీడియో స్క్రీనింగ్‌ వంటివన్నీ ఆ పథకం లబ్ధిదారుడికి చేరేందుకు ఉపయోగపడాలని, వాటి కారణంగా నిరాకరించకూడదని సీఎం ఆదేశించారు.

 

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*