ఏం చేస్తారో… చేయండి

chinthamaneni prabhakar denduluru assembly constiuency

పోలీసులు ఫిర్యాదు దారుల్ని భయపెట్టి తనపై అక్రమ కేసులను బనాయించారని టీడీపీ నేత దెందులూరుమాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బనాయించిన కేసులన్నీ అక్రమ కేసులేనన్నారు. పెట్టిన కేసులను నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమని చింతమనేని సవాలు విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న సమయంలో చింతమనేని మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న తనను రెచ్చగొడుతున్నారన్నారు. ఏం చేస్తారో చేయండి….. ఏ విచారణకైనా సిద్ధం అంటూ ఆగ్రహం వ్యక్తం
చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ తనపైచేసిన ఆరోపణలు రుజువు చేస్తే ఆస్తులన్నీ పేదలకు
రాసిస్తానని….లేదంటే బొత్స తన పదవి నుంచి తప్పుకుంటారా నని చింతమనేని సవాల్ విసిరారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*