
తమిళ ప్రజలు మార్పునకు నాంది పలకాలని రజనీకాంత్ కోరారు. 2021 ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమని ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రాజకీయాల్లోకి రాకుంటే మార్పు ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే తమిళ ప్రజల విక్టరీ అని రజనీకాంత్ తెలిపారు. అభిమానుల సహకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రజనీకాంత్ తెలిపారు. డిసెంబరు 31న పార్టీ వివరాలను ప్రకటిస్తానని చెప్పారు. తమిళ ప్రజలు తనను, తన పార్టీని ఆదరిస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. తమిళనాడును మార్చే అవకాశం వచ్చిందన్నారు. ఖచ్చితంగా మార్పు చేసి చూపిస్తానని రజనీకాంత్ తెలిపారు. తమిళనాడు కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు.
Leave a Reply