కేసీఆర్….దసరా బొనంజా

kcr met swaroopanandendra saraswathi

తెలంగాణ ప్రతిష్టకు చిహ్నమైన సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటాను పంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దసరా బోనస్‌గా ఈ 28 శాతం వాటాను వారికి అందజేయను న్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రతిష్టాత్మకమైన సింగరేణి సంస్థ పురోగతి, లాభనష్టాలు, ఆర్థిక లావాదేవీలపై అసెంబ్లీలో వివరించారు కీసీఆర్. సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. ఈ బోనస్ ద్వారా ఒక్కొక్కకార్మికుడు లక్షరూపాయలకు పైగా అందనుంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*