టిక్ టాక్ ను నిషేధించాలని కోర్టు ఆదేశం

చిన్నారులను పెడదోవ పట్టించే ప్రమాదమున్న టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చైనాకు చెందిన ఈ యాప్ పట్ల ఇటీవలి కాలంలో యువత, చిన్నారుల బాగా ఆకర్షితులయ్యారు. అయితే, ఈ యాప్ లో ఆశ్లీలత పెరిగిపోతోందని, దీంతో చిన్నారులపై ప్రభావం పడుతుందని పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లను విచారించిన కోర్టు పిటీషనర్ల వాదనతో ఏకీభవించింది. ఈ యాప్ ను నిషేధించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ యాప్ ద్వారా రికార్డ్ చేసిన వీడియోలను ప్రసారం చేయవద్దని సైతం మీడియాను కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 16 లోగా ఈ యాప్ పై కేంద్రం సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*