పవన్ కళ్యాణ్ కు అలీ స్ట్రాంగ్ కౌంటర్

ali counter to pawan kalyan

ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీలో చేరిన తర్వాత.. తన దగ్గర బలం లేదని అలీ వైసీపీలో చేరాడని చెప్పిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఉన్నట్టుండి రాజమండ్రిలో అలీ మీద సంచలన కామెంట్స్ చేసాడు. రాజమండ్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… అలీ తనని వెన్నుపోటు పొడిచాడని… అలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డానని అన్నాడు. అయితే నిజంగానే పవన్ కళ్యాణ్ స్నేహితుడైన అలీ జనసేనలో చేరుతాడనుకున్న వారికి ఝలక్ ఇచ్చి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. పవన్ తనపై చేసిన వ్యాఖ్యలు చూసిన అలీ ఒక వీడియో ద్వారా తన స్పందనను తెలియజేశాడు.

చస్తాను కానీ సాయం అడగను

ఇప్పుడు పవన్ గురించి అలీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ‘‘పవన్ కళ్యాణ్ గారికి నేనేంటో తెలుసు. నా గురించి పవన్ గారికి అలా అనిపించకపోయినా.. పక్కనున్నోళ్లు అలీది రాజమండ్రి, అక్కడ ఏదో ఒకటి అలీని అనమని గిల్లి ఉంటే పవన్ ఆ విధంగా స్పందించొచ్చు. అయినా పవన్ కళ్యాణ్ నాకు సహాయం చేశాను అని చెబుతున్నారు. ఏ విధంగా నాకు ఆయన సహాయపడ్డాడు. సినిమాలో వేషాలిప్పించాడా? లేదంటే డబ్బు రూపంలో సహాయం చేశాడా? అలా సహాయం పొందాలనుకుంటే ఆకలి చావుతో చావనైనా చస్తా కానీ.. నేను అలాంటి సహాయం మాత్రం కోరను’’ అంటూ ఘాటుగా స్పందించాడు అలీ.

కష్టపడి పైకొచ్చా.. మీలా కాదు…

ఇండస్ట్రీలో ఎంతో గొప్పవాడైన చిరు వేసిన బాటలో పవన్ సినిమాల్లోకొచ్చారు. కానీ తాను తన బాట తానే వేసుకుని కష్టపడి ఇండస్ట్రీలో పైకి వచ్చానని అన్నాడు. అలాగే జనసేన పార్టీ పెట్టినప్పుడు పార్టీలో చేరని మీరెప్పుడైనా పవన్ తనను అడిగారా అని ప్రశ్నించారు. అలీ చూట్టానికి టికెట్ ఇచ్చానని పవన్ అన్నారని, టిక్కెట్ తానేమీ అడగలేదని, తనకు టిక్కెట్ ఇస్తున్నట్లు కూడా చెప్పలేదని స్పష్టం చేశారు. ‘‘నేను ఏ పార్టీలో చేరితే మీకెందుకు… వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరకూడదా ? అదేమైనా తప్పా? రాజ్యాంగ విరుద్ధమా.. అయినా మీ స్థానం ఎప్పుడు నా గుండెల్లో ఉంటుందని నేను అందరికీ చెప్పాను.. మీరు పార్టీ పెట్టినప్పుడు మంచి మనసుతో మీరు, మీ పార్టీ బాగుండాలని ఖురాన్ తెచ్చి గిఫ్ట్ ఇచ్చాను. అయినా మీరు నన్ను అలా విమర్శించడం ఏం బాలేదు. ఎందుకు సర్‌ కామెంట్‌ చేయడం. నాకు చాలా బాధగా ఉంది. క్షమించడి.. ధన్యవాదాలు’’ అంటూ పవన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు అలీ.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*