
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యే అవకాశముంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళతారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు, వివిధ ప్రాజెక్టులపై డీపీఆర్ లు పంపాలని జలవనరుల శాఖ మంత్రి కోరడం, ఏపీలో జరుగుతున్న పరిణామాలపై జగన్ అమిత్ షా తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సమయం దగ్గర పడుతుండటంతో నిధుల కేటాయింపు విషయంపై కూడా జగన్ అమిత్ షాతో మాట్లాడతారని తెలిసింది.
Leave a Reply