అడ్వొకేట్ జనరల్ తో జగన్ భేటీ

జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడ్వకేట్ జనరల్ తో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న సందర్భంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సోమవారం కానీ ఆ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం లేదు. ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశానికి పంచాయతీ రాజ్ అధికారులు రాకపోవడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను బదిలీ, విధుల నుంచి తప్పించడంపై కూడా జగన్ అహసనంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో హోంమంత్రి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Ravi Batchali
About Ravi Batchali 34224 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*