
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రెండో రోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. నిన్నంతా బిజీగా గడిపిన జగన్ రాత్రి ఇడుపులపాయలో బస చేశారు. ఈరోజు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ సమాధికి నివాళులర్పించిన అనంతరం చర్చిలో ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా రాయచోటికి బయలుదేరి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాత్రికి తిరిగి ఇడుపులపాయకు చేరుకుంటారు.
Leave a Reply