అందుకే జాబ్ క్యాలండర్ ను తెచ్చాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. 2021 -22 సంవత్సరానికి రాష్ట్రంలో 10,342 ప్రభుత్వోద్యాగాలను భర్తీ చేయనున్నామని చెప్పారు. గతంలో ఏ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. 2021 -22 సంవత్సరానికి రాష్ట్రంలో 10,342 ప్రభుత్వోద్యాగాలను భర్తీ చేయనున్నామని చెప్పారు. గతంలో ఏ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. 2021 -22 సంవత్సరానికి రాష్ట్రంలో 10,342 ప్రభుత్వోద్యాగాలను భర్తీ చేయనున్నామని చెప్పారు. గతంలో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు జాబ్ క్యాలండర్ ద్వారా పోటీ పరీక్షలకు నిరుద్యోగులు సన్నద్ధమయ్యే వీలు కలుగుతుందని జగన్ తెలిపారు. విద్య, వైద్య, పోలీసు శాఖల్లో ఎక్కువ ఖాళీలున్నాయని, వాటిని దశల వారీగా భర్తీ చేస్తామని జగన్ చెప్పారు. జాబ్ క్యాలండర్ లో బ్యాక్ లాగ్ పోస్టులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే లక్ష ఉద్యోగాలను భర్తీ చేశామని జగన్ చెప్పారు.