సరిలేరులో బెస్ట్ స్మైల్

సరిలేరు నీకెవ్వరూ

దీపావళికి సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని పాత్రల పరిచయాల్తో వదిలిన పోస్టర్స్ తో సూపర్ స్టార్ మహేష్ అభిమానులు హ్యాపీ ఫీల్ అయ్యారు. మహేష్ లుక్ తో పాటుగా, విజయ శాంతి రాయల్ లుక్ అండ్ రష్మిక ల లుక్స్ ని విడుదల చెయ్యడమే కాకుండా. అనిల్ రావిపూడి, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ సరిలేరు నీకెవ్వరూ సినిమాపై చేసిన కామెడీ స్కిట్ కూడా అందరిని ఆకట్టుకుంది. సాంగ్స్ బయటికి రాలేదు అన్న అసంతృప్తి తప్ప మిగతా ప్రమోషన్స్ విషయంలో మహేష్ ఫాన్స్ ఫుల్ హ్యాపీ.

ఏం మాట్లాడుతున్నారు….

ఇక దివాలి పోస్టర్స్ సంగతెలా ఉన్నా ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ నుంచి బయటి కొచ్చిన ఓ ఫోటో మాత్రం బెస్ట్ స్మైల్ పిక్ అంటున్నారు. విజయ శాంతి, ప్రకాష్ రాజ్ తో పాటుగా దర్శకుడు అనిల్ రావిపూడి, మహేష్ బాబు నవ్వుతూ మట్లాడుకుంటున్న ఫోటో మాత్రం అదిరిపోయింది. ఇప్పటివరకు సరిలేరు అప్ డేట్స్ పోస్టర్స్ ఒక ఎత్తైతే.. ఇప్పుడు బయటికొచ్చిన ఈ ఫోటో ఒక ఎత్తు అనేలా ఉంది. లేడి సూపర్ స్టార్ విజయశాంతి లుక్ కానీ, ప్రకాష్ రాజ్ లుక్ కానీ ఆకట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఓ పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నాడనే టాక్ ఉంది. మరి ప్రకాష్ రాజ్ ఎలా కనిపించబోతున్నాడో అనే క్యూరియాసిటీ కన్నా.. మహెష్ – విజయ శాంతి – ప్రకాష్ రాజ్ ఏం ముచ్చటించుకుంటున్నారో అనే క్యూరియాసిటీ ఎక్కువయ్యేలా ఉంది ఆ ఫోటో చూస్తే.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*